కోనసీమ: పి.గన్నవరం మండలం మొండేపులంక గ్రామంలో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత, లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


