మెదక్: శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో గురువారం గ్రామస్తులు కల్లు దుకాణాన్ని ధ్వంసం చేశారు. దేవాలయం పక్కన అక్రమంగా కల్లు దుకాణం పేట్టారని వారు ఆరోపించారు. ఇదే విషయమై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వద్ద కల్లు దుకాణం వల్ల చోరీ ఘటనలు పెరిగాయని పేర్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కల్లు దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్తులు


