హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి కొనుగోళ్లకు ఐదు సీసీఐ కేంద్రాలు సిద్ధం

భూపాలపల్లి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాటారం మార్కెట్ పరిధిలో రెండు, చిట్యాలలో రెండు, భూపాలపల్లిలో ఒక కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సీజన్‌లో 1,09,442 ఎకరాల్లో పత్తి సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 1,30,645 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.