NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురంలో గురువారం ‘మన భూమ–మన ధీమా’ 18వ రోజు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


