హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా మున్సిపల్ కమిషనర్‌గా బి.రాంగోపాల్

పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్‌గా బి. రాంగోపాల్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులు,పారిశుద్ధ్యం,తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు. పట్టణ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.