హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో 'స్వచ్ఛతే సేవ' నిర్వహణ

AKP: జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఛైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సీఎం చంద్రబాబు లక్ష్యమైన 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిశుభ్రతే ఆరోగ్యవంతమైన సమాజానికి మంచిదని పేర్కొన్నారు.