హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

VZM: మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పింఛను ఇంటికి పెద్ద కొడుకు వలె అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి శ్రీనివాస పాణి పాల్గొన్నారు.