హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇండోర్ స్టేడియం పనులు పరిశీలించిన మంత్రి

ATP: ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియం భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. 2017లో ప్రారంభమైన ఈ నిర్మాణాలను గత ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందని, వాటి పునర్నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పారు.