ATP: అనంతపురం RDT గ్రౌండ్‌లో జరిగిన 2వ అమరావతి ఛాంపియన్‌షిప్ ఇంక్లూసివ్ సౌత్ జోన్ క్రికెట్ టోర్నీలో నెల్లూరు జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కడపపై, అంతకుముందు కర్నూలుపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. విజేతలకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు. దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని జిల్లా కార్యదర్శి రోషిరెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి ఛాంపియన్‌షిప్ విజేత నెల్లూరు


