KDP: సిద్దవటం పెన్నా నది వంతెనపై వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వేసిన మట్టి నిల్వలు ఇంకా తొలగించలేదు. నిమజ్జనం కోసం ఫుట్‌పాత్ పక్కన మట్టి పోసి సమాంతరం చేసి బల్ల ఏర్పాటు చేశారు. వేడుకలు ముగిసినా మట్టిని అలాగే వదిలేయడంతో వర్షం కురిస్తే నీరు కిందకు వెళ్లక వంతెనపై నిలిచే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే మట్టిని తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్నా నది వంతెనపై మట్టి నిల్వలు


