VKB: కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శిథిలమైన నీటి ట్యాంకులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల్లో 34 ట్యాంకుల నిర్మాణాలకు రూ. 10.77 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మంజూరు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
శిథిలమైన నీటి ట్యాంకులు.. నిధులు మంజూరు


