హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఖోఖో పోటీల ఎంపికలు

VZM: కృష్ణా జిల్లా కంచికచెర్లలో అక్టోబర్ రెండో వారంలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల ఖోఖో పోటీల ఎంపికలు ఈనెల 2న కస్పా మైదానంలో జరుగుతాయని జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు కమలనాభరావు, గోపాల్ తెలిపారు. 2008 డిసెంబర్ 1 తర్వాత పుట్టి, వయసు, బరువు, ఎత్తు కలిపి 250 పాయింట్ల లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఆ రోజు ఉదయం 8 గంటలకు హాజరుకావాలని కోరారు.