హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఐటీడీఏకు రెగ్యులర్ డిడిని నియమించాలి'

ఐటీడీఏకు రెగ్యులర్ డిప్యూటీ డైరెక్టర్‌ను వెంటనే నియమించాలని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు పల్లా సురేష్ డిమాండ్ చేశారు. ఇవాళ కురుపాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్‌ఛార్జ్ అధికారులు బాధ్యతలు నిర్వహించడం వల్ల గిరిజన విద్యా సంస్థల పర్యవేక్షణపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలలు, నిర్వహణ, సమస్యల పరిష్కారానికి రెగ్యులర్ డిడి అవసరం అన్నారు.