హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

అన్నమయ్య: పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ బలిజపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ నాయుడు, ఈశ్వర్, కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.