హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మాంసం విక్రయాలు బంద్

JN: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జనగామ మున్సిపాలిటీ పరిధిలో మాంసం, చికెన్ విక్రయాలను నిలిపివేయాలని గురువారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. జీవహింసకు పాల్పడవద్దని వ్యాపారులను కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు జరిమానా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు.