హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగారెడ్డిగూడెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

ELR: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్ర శేషు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే దాదాపు 61.80 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,692.34 కోట్ల మేర పంపిణి చేస్తున్నామన్నారు.