హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెన్షన్ నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెడన మండలం పుల్లలపాడు గ్రామంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం ప్రజల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.