హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'

VSP: పశ్చిమ నియోజకవర్గంలోని కొత్తపాలెంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గణబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్ అందజేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన ఆయన, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.