GDWL: రాజోలి కస్తూర్బా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణాలు పూర్తికాకపోవడంతో 220 మంది బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లోనే సామాగ్రి ఉంచుకోవాల్సి వస్తోందని, రాత్రి నిద్రించడానికి కూడా అవస్థలు ఎదురవుతున్నాయని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులను త్వరగా పూర్తి చేయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
అదనపు గదులు పూర్తయ్యేదెన్నడు..?


