హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అర్హులందరికీ సంక్షేమ పథకాలు'

SKLM: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని APTPC చైర్మన్, TDP రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వి. బాబురావు తెలిపారు. ఇవాళ పలాసలో పేదల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలను అందిస్తుంది అని అన్నారు.