హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు

SKLM: ఇవాళ అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకలేదు. సాధారణంగా ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో (మార్చి 9, 10, అక్టోబర్ 1, 2) కిరణాలు తాకడం ఆనవాయితీ. అయితే ఈసారి ఈ అద్భుతం జరగలేదని, శుక్రవారం సూర్యకిరణాలు స్వామివారిని స్పృశించే అవకాశం ఉందని ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు.