హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 5న ఖానాపూర్‌లో ఎంపీపీ సమావేశం

NRML: ఈనెల 5న ఖానాపూర్‌లో మండల ప్రజా పరిషత్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాధా రాథోడ్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. 45 రోజులకోసారి జరిగే ఈ సమావేశంలో గ్రామాల అభివృద్ధి పనులపై చర్చించి దిశానిర్ధేశం చేయాలని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించాలని MPDO కోరారు.