హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభం

ప్రకాశం: మార్కాపురం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. మూడు నెలల విరామం అనంతరం దోర్నాల మండలం తుమ్మలబైలు జంగిల్ సఫారీలో పర్యాటకులను అనుమతించనున్నారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం, వర్షాకాలం నేపథ్యంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు సఫారీని నిలిపివేసిన అటవీశాఖ అక్టోబర్ 1 నుంచి సేవలను పునరుద్ధరించింది.