హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రావ్యకు అండగా ఆర్మీ ఉద్యోగి

SS: పుట్టపర్తిలోని తారకరామా కాలనీకి చెందిన అనాథ విద్యార్థిని శ్రావ్యకు ఆర్మీ ఉద్యోగి కదిరిసాని వెంకటేష్ సైకిల్ బహుకరించారు. చిన్నపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థిని రోజూ పాఠశాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందిని ఖిద్మత్-ఎ-ఖల్క్ ట్రస్ట్ సభ్యులు గుర్తించారు. ఇది తెలుసుకున్న వెంకటేష్ తన తల్లి జ్ఞాపకార్థం శ్రావ్యకు సైకిల్ అందించారు.