హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: నెన్నెల మండలం కోనంపేట 11KV ఫీడర్‌లో అత్యవసర మెయింటనెన్స్ పనుల కారణంగా గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE రాజన్న తెలిపారు. కర్జీ జంగల్ పేట, కోనంపేట, కృష్ణపల్లి, దమ్మారెడ్డిపేట, పంగిడిసోమారం గ్రామాల్లో అంతరాయం ఉంటుందన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని AE కోరారు.