KRNL: దేవనకొండలో డెంగ్యూ జ్వరంతో 19 నెలల చిన్నారి మృతి చెందాడు. చిన్నారి మృతదేహంతో తండ్రి MPDO కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్రామంలో పారిశుధ్య లోపాలు, దుర్వాసనపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. మరో చిన్నారికి ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
డెంగ్యూతో 19 నెలల చిన్నారి మృతి


