హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

POSH చట్టం అమలుపై నేడు సమీక్ష

PLD: ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత, లైంగిక వేధింపుల నివారణకు సంబంధించిన POSH చట్టం–2013 అమలుపై గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని శ్రీ గుర్రం జాషువా సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ హాజరవుతారు. ICCల పనితీరు, ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షిస్తారు.