హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటు సేవలు పునరుద్ధరణ

కోనసీమ: గోదావరి వరద ఉధృతి తగ్గడంతో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సఖినేటిపల్లి–నరసాపురం మధ్య పంటు సర్వీసులను గురువారం అధికారులు పునరుద్ధరించారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఊరట లభించింది. వశిష్ట వారధిపై రాకపోకలకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో పంటు సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల అవస్థలు తొలగాయి.