హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయిన బాబాసాగర్ విద్యార్థులు

ASF: కౌటాల మండల కేంద్రంలో నిర్వహించిన SGF అండర్-17 కబడ్డీ పోటీల్లో ZPHS బాబాసాగర్ పాఠశాల విద్యార్థులు గుర్లే కార్తీక్, పిప్రె అంజన్న జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, PET అశోక్‌తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జోనల్ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.