హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్ముడి హత్య కేసులో అన్నకు జీవిత ఖైదు

KMM: ఆస్తి వివాదంలో తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామానికి చెందిన రెడ్డిబోయిన నాగరాజు 2022 జూన్ 9న తమ్ముడు రామలింగంపై కర్రతో దాడి చేసినట్లు కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు  శిక్ష ఖరారు చేస్తూ.. రూ.వెయ్యి జరిమానా కూడా విధించింది.