KRNL: జిల్లాలో పెరిగిన వంటనూనెల ధరలను నియంత్రించేందుకు రైతుబజార్లలో తగ్గింపు ధరలకు నూనెలు విక్రయిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సి.క్యాంప్, కొత్తపేట, వెంకటరమణ కాలనీ రైతుబజార్లలో ఆధార్ ఆధారంగా ప్రతి కుటుంబానికి లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.166, వేరుశెనగ నూనె రూ.170కు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతుబజార్లలో తగ్గింపు ధరలకు వంటనూనెల విక్రయం


