హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎల్‌ఓసీ అందజేత

KNR: చొప్పదండి పట్టణానికి చెందిన తాళ్లపెల్లి రాజయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స కోసం ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. మంజూరైన ఎల్‌ఓసీని రాజయ్య కుటుంబ సభ్యులకు MLA అందజేశారు.