హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభించిన మంత్రి

KRNL: నగర క్రీడాకారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. బుధవారం కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నూతన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించారు. స్టేడియంలో రూ.3.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.