హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి నమూనాలపై విద్యార్థులకు అవగహన

VKB: బట్వారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు మట్టి నమూనాలపై నిన్న మండల వ్యవసాయ అధికారి శ్రావ్య అవగాహన కల్పించారు. ఆయా రకాల నేలలు, వాటిలోని నత్రజని, భాస్వరం, పోటాషియం తదితర పోషకాల స్థాయిని పరీక్షలతో గుర్తించడం ద్వారా ఆ నేలకు అనువైన పంటలను పండించేందుకు ఉపకరిస్తుందన్నారు. భూమిలోని వివిధ రకాల లవణాలు, ఖనిజాలు వంటి పోషకాలను గుర్తించేందుకు ఈ పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.