హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్షం వస్తే రహదారి బురదమయం'

PPM: సీతానగరం మండలం అప్పయ్యపేట- రేపటివలస మధ్య రహదారి అధ్వానంగా మారింది. పదేళ్ల క్రితం నిర్మించిన మెటల్ రోడ్డులో కొండగెడ్డ వద్ద కల్వర్టు లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. దీంతో రహదారి బురదమయమై, గెడ్డ పొంగిన సమయంలో రేపటివలసకు రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.