SKLM: పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దుర్గమ్మను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకరణలో పాతపట్నం అమ్మవారు


