ADB: కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్‌కు వెళ్తున్న పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి ఇచ్చోడ మండలం ముక్రా(కె) జాతీయ రహదారిపై కారు, కంటైనర్‌ను ఢీకొట్టింది. కారులో ADB ఎస్సై సంజయ్ పాటు కానిస్టేబుళ్లు రుక్మారెడ్డి, హనుమంతు, రంజిత్ ఉన్నారు. ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.
తెలంగాణ
కారు, కంటైనర్ ఢీ.. పలువురికి గాయాలు


