హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

MBNR: జడ్చర్ల డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ ప్రవేశాల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సుకన్య తెలిపారు. మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించి ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.