WGL: కరీమాబాద్ ఏకశిల నగర్‌లో నాగబోయిన కుమారస్వామి(42) అనే ట్రాలీ డ్రైవర్ బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ట్రాలీ డ్రైవర్ ఆత్మహత్య


