హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు

NLR: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ ఎస్ఎంసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం దాదాపుగా 2443 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.