హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 2.87 లక్షల మందికి పింఛన్లు పంపిణీ

NLR: జిల్లా వ్యాప్తంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పిడి నాగరాజకుమారి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. 2,87,428 మంది లబ్ధిదారులకు దాదాపుగా రూ. 126.19 కోట్లు నగదు పంపిణీ చేయనున్నారు. సచివాలయం సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ నగదును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.