హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మాంసం విక్రయ దుకాణాలు మూసివేత

PDPL: గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని మాంసం విక్రయ దుకాణాలను మూసివేయాలని కమిషనర్ అరుణశ్రీ (ఎస్ఏసీ) ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవహింస నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మాంసం విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.