హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ ప్రాంగణంలో బుధవారం మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. CITU జిల్లా నాయకులు పి. కేశవరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.32 వేలు చెల్లించాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగం కల్పించాలని కోరారు.