హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

SRD: జిల్లాలో 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వీటిలో 196 కేంద్రాల్లో దొడ్డు రకం, 31 కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.