ADB: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసగించిన కేసులో మావల పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు CI ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. పట్టణానికి చెందిన అశోక్, రఘు కలిసి సూరిండ్ల రాజు వద్ద డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అశోక్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు CI ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఉద్యోగం పేరుతో మోసం.. నిందితుడు అరెస్టు..!


