హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిచ్చి కుక్క దాడిలో 15 మందికి గాయాలు

WG: పాలకొల్లు పట్టణంలో ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి సుమారు 15 మందిపై దాడి చేసింది. బాధితుల్లో ఇప్పటివరకు 9 మంది ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ యర్రా మాధురి తెలిపారు. ప్రజలు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్‌కు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన సిబ్బంది ఆ కుక్కను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.