హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తాం: ఛైర్మన్

WGL: ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఛైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సంఘ అభివృద్ధి, కొత్త సభ్యత్వ నమోదు, రైతులకు పంట రుణాలు, సకాలంలో ఎరువుల సరఫరాకు కృషి చేస్తామని, నిరంతరం రైతులకు అండగా ఉంటామని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్, సర్పంచులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.