హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

KMM: విద్యుత్ శాఖకు సంబంధించిన కొత్త కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు (గురువారం) ఖమ్మం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎదులాపురం పరిధిలోని వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద TGNPDCL డివిజన్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.