హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిర్చి ధరలు స్థిరంగా.. అమ్మకాలు నెమ్మదిగా

GNTR: జిల్లాలో మిర్చి మార్కెట్‌కు సుమారు 6 వేల బస్తాల సరుకు వచ్చింది. సీడు రకం మిర్చి కిలో రూ.160-370, నాటు రకం రూ.180-280 వరకు ధర పలికింది. తాలు రకాల ధరలు రూ.120-160 మధ్య నమోదయ్యాయి. అమ్మకాలు నెమ్మదిగా సాగినా ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. మార్కెట్‌లో ధరలు దాదాపు స్థిరంగా కొనసాగాయి.