NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి ఆలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. అనంతరం అభిషేకాలు, కుంకుమార్చనతో పాటు పలు పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు


